Thursday, January 23, 2025

‘భీమదేవరపల్లి బ్రాంచి’ మట్టి నుంచి పుట్టిన సినిమా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎ.బి. సినిమాస్‌, నిహాల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ఈ చిత్రంలో బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి  ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది.

తొలి ఆట నుంచే ఆర్గానిక్‌ హిట్‌ టాక్‌ను స్వంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినిమా సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.

Also Read: ఆసక్తి రేపుతున్న వర్మ ‘వ్యూహం’ టీజర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News