పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. అన్ని సెట్టయ్యి ఉంటే ఈ జనవరిలో రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం విశేషం. అయితే ఈ కామెంట్స్ మాత్రం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాను, దర్శకుడు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ రష్ అవుట్ పుట్ చూసామని అన్నారు. ఒక్క మాట అయితే చెప్పగలను… ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ది బెస్ట్‌గా నిలుస్తుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా తన వల్ల అయ్యినది అంతా కూడా ఈ సినిమా కోసం చేసానని తమన్ తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ పవన్ అభిమానులను ఎంతో సంతోషపరిచాయి. ఈ మాస్ ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఇ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.