Thursday, January 23, 2025

పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘భీమ్లా నాయక్’ ప్రీరిలిజ్ ఈవెంట్ కన్ఫామ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవన్ కల్యాణ్ అభిమానులకు ‘భీమ్లా నాయక్’ చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘భీమ్లా నాయక్’ మూవీ ప్రీరిలిజ్ ఈవెంట్ న్యూ డేట్ ను ప్రకటించింది. నిన్న జరగాల్సిన ఈ ఈవెంట్, ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదా వేశారు. తాజాగా రేపు(బుధవారం) సాయంత్రం 6గంటలకు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ‘భీమ్లా నాయక్’ ప్రీరిలిజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్రబృదం అధికారికంగా ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే, సంభాషణలను అందించాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతోంది.

‘Bheemla Nayak’ Pre Release Event on Feb 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News