Sunday, January 19, 2025

భీమ్ ఆర్మీచీఫ్ ఆజాద్‌పై కాల్పులు

- Advertisement -
- Advertisement -

షహ్రాన్‌పూర్ : ఉత్తరప్రదేశ్‌లో భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ రవణ్‌పై బుధవారం కాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని సహ్రాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆజాద్ తమ టయోటా కారులో వెళ్లుతుండగా మరో కారులో వెంబడించిన వారు కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. మొదటి బుల్లెట్ కారు సీటుకు తగిలింది. దీనితో ఆజాద్ మణికట్టుకు గాయమైంది.

రెండో బుల్లెట్ వెనక వైపు నుంచి వచ్చి ఆజాద్‌కు దాదాపుగా తగులుకుంటూ వెళ్లింది. హత్యాయత్నం నుంచి ఆయన బయటపడ్డారని , వెంటనే వైద్య చికిత్సకు తరలించారని సీనియర్ పోలీసు అధికారి విపిన్ టాడా తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సిహెచ్‌సి వైద్యులు వివరించారు. ఆజాద్‌ను కారులో చాలా దూరం వరకూ వెంబడించి అదును కోసం వేచి చూసిన ఆగంతకులు దాడికి దిగారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News