Wednesday, January 22, 2025

ఈ రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడురా.. భీమా టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

మాచో హీరో గోపీచంద్ నటిస్తున్న క్రేజీ మూవీ భీమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో చూపించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. గోపిచంద్ ఎద్దుపై వచ్చిన సీన్ ను.. ఈ రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడురా.. అనే డైలాగ్ తో హైలెట్ గా చూపించారు. మొత్తానికి ఈ టీజర్ మూవీపై ఆసక్తిని పెంచింది. వరుస ప్లాపులతో సతమతవుతున్న గోపిచంద్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నట్లు ఉంది ఈ టీజర్.

ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా తెరకెక్కుతోంది. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకట్, డాక్టర్ రవివర్మ  యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News