Thursday, January 23, 2025

కన్నుల పండువగా భీమన్న దేవుని పండగ

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : భక్తితో వేడిన చాలు కోరిన కోరికలను తీర్చి వెన్నంటి కష్టాలను తొలగించి ఆదివాసీల కలియుగ ప్రత్యక్ష దైవం భీమన్న దేవుడని నాయక్‌పోడ్ కులస్తులు అన్నారు. భీమన్న దేవుడి పండగను పురస్కరించుకొని గ్రామాలలో ఉదయం నుండే పండగ వాతావరణం నెలకొంది. మండలంలోని పుస్పూర్ గ్రామంలో ఆదివారం ఆదివాసీల ఇష్టదైవం భీమన్న దేవుని పండగను ఆదివాసి నాయక్‌పోడ్ సంఘం ఆధ్వర్యంలో వారి కుల సాంప్రదాయ బద్ధ్దంగా భజా భజంత్రిలతో మంగళ హారతుల నడుమ భక్తి శ్రద్ధ్దలతో ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివాసి కుల పెద్దలు మాట్లాడుతూ ప్రతియేటా వర్షాకాలం ప్రారంభానికి ముందు మృగశిర కార్తే ప్రారంభమవ్వగానే పంటలకు అనుగుణంగా సరైన సమయంలో వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామాలు సస్యశ్యామలమవ్వాలని తమ కుటుంబాలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో విరసిల్లాలని కుటుంబీకులతో కలిసి భీమన్న పండగను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, మహిళలు, యువకులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News