అమరావతి: భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని జ్యోతిషుడిని భర్త హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్న జిల్లా భీమిలి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు- మౌనిక అనే దంపతులు బతుకుదెరువు కోసం లోగడలవానిపాలెం నివసిస్తున్నారు. మౌనిక పూజల నిమిత్తం జ్యోతిషుడు అప్పన్న(50)ను తన ఇంటికి పిలిచింది. జ్యోతిషుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో తన భర్తకు ఈ విషయం చెప్పింది. అప్పన్నను హత్య చేయాలని చిన్నారావు ప్లాన్ వేశాడు.
తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని పూజలు చేయాలని అప్పన్నను చిన్నారావు కోరాడు. బైక్‌పై నేర్లవలసకు తీసుకెళ్తన్నట్టు జ్యోతిషుడికి నమ్మకం కల్పించాడు. కల్లివానిపాలెం గ్రామం శివారులోకి రాగానే కత్తి తీసుకొని అప్పన్నను చిన్నారావు పలుమార్లు పొడిచి చంపేశాడు. తన చేతికి గాయం కావడంతో కెజిహెచ్‌లో కట్లు కట్టించుకున్నాడు. మర్నాడు జ్యోతిషుడి మృతదేహం వద్దకు తన భార్యతో కలిసి వెళ్లి శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కల్లివానిపాలెం గ్రామస్థులకు అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి అస్థిపంజరం జ్యోతిషుడు అప్పన్నగా గుర్తించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా చిన్నారావు దంపతులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.