Monday, December 23, 2024

పిట్టా పక్షుల భూతల స్వర్గం భితార్కనికా పార్కు

- Advertisement -
- Advertisement -

తూర్పు భారతం లోని ఒడిశాలోని ఈశాన్య కేంద్ర పరా జిల్లాలో 145 కిమీ వైశాల్యంలో విస్తరించిన భితార్కనికా నేషనల్ పార్కులో మడ అడవులకు సంబంధించిన పిట్టా పక్షులపై అటవీ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. ముందుగా గుర్తించిన 32 ప్రాంతాల్లో 32 బృందాలు కాలినడకన, బోట్లపైన వెళ్లి వాటి ఆచూకీ ఆరా తీశారు. భితార్కనికా జాతీయ పార్కులో మహీపుర నదీ ముఖ ద్వారం వద్ద వీటి జాడ కనిపించింది. అన్యదేశ సంబంధ ఆకర్షణీయ పక్షులుగా గుర్తింపు పొందిన ఈ పిట్టా మేఘరెంచా పక్షులపై సర్వే జరగడం ఇదే తొలిసారి.

Also read: ప్రపంచంలో టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు

ఈ పక్షులు ఒడిశా లోని భితార్కనికా, పశ్చిమబెంగాల్ లోని సుందర్‌బన్ మడ అడవులకే పరిమితమై మనుగడ సాగిస్తున్నాయి. ఇవి ఎలా జీవిస్తుంటాయో, ఎలా అభివృద్ధి చెందుతుంటాయో తెలుసుకోడానికి ఈ సర్వే ప్రారంభించారు. ఇంతవరకు 179 మడ అడవుల పిట్టా పక్షుల లెక్క తేలిందని ఒడిశా రాజ్‌నగర్ మాంగ్రోవ్ ఫారెస్ట్ డివిజన్ అధికారి గోపీనాథ్ సుదర్శన్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం పిట్టా పక్షుల భూతల స్వర్గంగా ఈ పార్కు కనిపిస్తోంది. ఈ పక్షులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నలుపు రంగు తల, ఊదారంగు పింఛం, తెల్లటి కంఠం,ఆకుపచ్చని రంగులో పైభాగాలు, కింది భాగాలు ఎరుపుగా ఇవి చాలా రంగురంగులతో ఉంటాయి.

Also read: ప్రపంచంలో టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు

ఈ పక్షులు చిత్తడి నేలల్లోని మడ అడవుల్లో ఎక్కడైతే జలచరాలు, కీటకాలు ఉంటాయో అక్కడ విశేషంగా ఉంటాయి. ఇవి అంతరించే వర్గంలో ఉన్నప్పటికీ ఇంకా నిర్ధారణ కావలసి ఉంది. 1998 సెప్టెంబర్ 16న జాతీయ ఉద్యానవనంగా గుర్తింపు పొందిన భితార్కనికా పార్కులో అనేక మడ జాతుల అడవులు ఉన్నాయి. దేశం మొత్తం మీద రెండవ అతి పెద్ద పర్యావరణ వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఉప్పునీటి మొసలి, ఇండియన్ పైథాన్, కింగ్ కోబ్రా, బ్లాక్ ఐబిఎస్ , డార్టర్స్, జంతువులతోపాటు ఆలివ్ రెడ్లీ తాబేళ్లు, గహిర్మత, ఇతర బీచ్‌ల్లో కనిపిస్తాయి. అంతరించిపోతున్న ఉప్పునీటి మొసళ్లు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. దాదాపు 1671 ఉప్పునీటి మొసళ్లు ఇక్కడ ఉన్నాయి.

Also read: అన్నం పెట్టిన రైతుతో కొంగ దోస్తీ(వైరల్ వీడియో)

2014లో వార్షిక సంతానోత్పత్తి ద్వారా దాదాపు 3000 మొసళ్లు పుట్టాయి. 2014లో క్షీరదాల సర్వే ప్రకారం 1872 మచ్చల జింకలు, 1213 అడవి పందులు, కోతులు 1522, నక్కలు 305,సాధారణ లంగూర్ 39,ఓటర్ 38, సాంబార్ జింక 17,అడవి పిల్లులు 11,ముంగిసలు 7, తోడేళ్లు 7 , చేపలు పట్టే పిల్లులు 12 వరకు ఉన్నట్టు తేలింది. పరిశోధకులకు ఈ నేషనల్ పార్కు ఎంతో ఉపయోగపడుతోంది. ఇది గొప్ప చారిత్రక, సాంస్కృతిక చరిత్ర గలిగిన ప్రదేశం. ఒకప్పటి కనికా రాజు వేట స్థలం ఇదేనని చెబుతుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News