Monday, December 23, 2024

పండుగ వై’భోగి’

- Advertisement -
- Advertisement -

పుడమిపై ఆవరించిన
పొగమంచును పారద్రోలి,
చలిపులిని పొలిమేరలకు తరిమికొట్ట
అంబర యవనికను చీల్చుకుంటూ
పుడమిపైకి ప్రవేశించనున్న
నవ్యనూతన
భాస్కరుని నునువెచ్చని కిరణాలకు
స్వాగతం పలికే
భోగభాగ్యాల పండుగ,
సస్యలక్ష్మి గృహసీమలనలరించే పండుగ.
పాత చెడులను పారద్రోలే
అరిషడ్వర్గాలను అణచివేసే ,
‘మంటల’ పండుగ.
కన్నెపిల్లల
గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు
పసిపిల్లల దృష్టి దోష నివారణ పండుగ.
బసవన్నల, బుడబుక్కల
హరిదాసుల, గాలిపటాల
సమైక్యతను పెంపొందించే పండుగ.
అనురాగాప్యాయతల
అందాల, ఆనందాల పండుగ
అదే అదే… మన భోగి పండుగ.

వేమూరి శ్రీనివాస్
9912128967

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News