Sunday, January 19, 2025

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగీ సంబరాలు..

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగీ సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ కంటే.. ఏపీలో సంక్రాంతి పండగను ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాలను ప్రజలు సొంతూర్లకు చేరుకున్నారు.

పలు ప్రాంతాల్లో రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు సందడి చేస్తున్నారు. గ్రామాలల్లో హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సంక్రాంతి పండగ వాతారవరణం ఉట్టిపడుతోంది. ఏపీలో ఈ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున కోళ్ల పందెలు నిర్వహిస్తారు. ఈ పందెంలను చూసేందుకు భారీగా జనాలు వచ్చి ఎంజాయ్ చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News