Monday, December 23, 2024

చెడుపై మంచి విజయానికి ప్రతీక భోగి : మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్లుగా భారత దేశంలో కూడా ముందుకు వెళ్లాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సూర్యాపేట లోగిళ్లలో భోగి మంటలతో ఘనంగా ప్రారంభమయ్యింది. రంగు రంగుల రంగవల్లుల నడుమ భోగి మంటల కాంతులతో ఊరు , వాడల్లోని కూడళ్ళు సంక్రాంతి సంభారాల సంతోషాలు ప్రతిభింబించాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటు చూసిన భోగి మంటల సందడులే కనిపించాయి. పలు కూడళ్ళలో జరిగిన భోగి మంటలు వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.


వేడుకలకు మంత్రి రావడంతో మరింత ఉత్సాహంతో కేరింతలు కొట్టి మంత్రితో స్థానికులు సెల్ఫీలు దిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎన్నడు లేని విదంగా వార్డులల్లో ప్రజలు సామూహికంగా భోగి మంటలు వేసుకుని ఆడి , పాడారు. అందమైన రంగుల ముగ్గులు వేసి వాటి నడుమ గత సంవత్సరం సంక్రాంతి గొబ్బిళ్ళను , ఇంట్లో అరిష్టంగా భావించే పాత కర్రలను వేసి భోగి మంటలు వేసుకుని చిన్న , పెద్దా కలిసి ఒక్క చోట చేరి భోగి మంటలతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు.

పట్టణంలోని స్థానిక విద్యానగర్ చౌరస్తాలో వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున చేరి భోగి మంటల కాంతుల మద్య కోలాటం వేస్తూ ఆనందంగా నృత్యాలు చేసారు . సామూహికంగా ప్రజల నడుమ ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. చెడు పై మంచి విజయానికి ప్రతీక సంక్రాంతి పండుగని , బోగీ మంటల్లో చెడుని ఆహుతి చేసి మంచి చేయాలని ప్రజలకు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతున్నట్లుగా భారత దేశం కూడా ముందుకు సాగాలని ఆయన ఆకాక్షించారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్న సందర్భంలో మళ్ళీ సంక్రాంతి పండుగ వరకు దేశంలో వారు ఆకాంక్షిస్తున్న మార్పు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గండూరి ప్రకాష్ , కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, కాడారి సతీష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News