Wednesday, January 22, 2025

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 14న భోగితేరు, 15న మకర సంక్రాంతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఈనెల 14న భోగితేరు, 15న మకర సంక్రాంతి పర్వదినాలు జరగనున్నాయి. భోగి పండుగ రోజు సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ అండాల్ అమ్మవారు, శ్రీకృష్ణ స్వామి వారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈనెల 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 6.30 గంటలకు ఆలయం నుంచి చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా కపిల తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ చక్రస్నానం అనంతరం ఆస్థానం చేపడుతారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శమిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News