Monday, December 23, 2024

‘బోయగూడ’ ఘటనపై దర్యాప్తు వేగవంతం

- Advertisement -
- Advertisement -

Bhoiguda fire accident latest update

ఐదు బృందాలతో అన్ని కోణాల్లో విచారణ
60మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డ్
కీలక ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలింపు

హైదరాబాద్: నగరంలోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై 5 బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల నిర్ధారించినప్పటికీ ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ ప్రమాదానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ ఇన్చార్జ్ డాక్టర్ వెంకన్న నేతృత్వంలో ఐదు బృందాలకు చెందిన 12 మంది సభ్యులు క్షేత్రస్థాయిలో ఘటనాస్థలిలో త్రీడీ స్కానర్‌తో అణువణువూ పరిశీలించి సేకరించిన ఆధారాలు ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్ కు తరలించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 60 మంది సాక్షులను ప్రశ్నించడంతో పాటు మృతుల కుటుంబాల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఈక్రమంలో 11 మంది కార్మికులు సజీవదహనమైన అగ్నిప్రమాదంపై రెండు అంతస్థులలో క్లూస్‌టీం త్రీడీ స్కనర్‌తో పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. అలాగే ఫైర్ సేఫ్టీ,క్లూస్ టీమ్స్ షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. తొలుత స్క్రాప్ గోదాంలో మంటల అంటుకోవడం ద్వారా కరెంట్ బోర్డులు, సిలిండర్ పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు.

గోదాములో ఒక్కో ఫ్యూజ్‌లో అదనంగా మందమైన మూడు నాలుగు వైర్లు ఉన్నట్లు గుర్తించిన బృందాలు కేబుల్, ప్లాస్టిక్ వైర్స్‌పై నిప్పురవ్వలు పడడం, స్విచ్ బోర్డులు, గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్క్రాప్ గోదాంలో 10కిపైగా స్విచ్‌బోర్డులు ఉండటం, గోదాములో కరెంట్ ఎక్కువ వాడకంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డట్టుగా అనుమానిస్తున్నారు. అలాగే పై అంతస్తుకు వెళ్లేందుకు ఇనుప మెట్లు ఉడడంతో పైనున్న వారు కిందకు రాలేకపోయారని, దట్టమైన పొగవల్ల కూలీలు స్పృహకోల్పోయి మంటల్లో సజీవదహనం అయినట్టు నిర్దారించారు. అలాగే అగ్నిప్రమాదం, గ్యాస్ పేలుడు ధాటికి తునాతునకలైన రేకులు సిలిండర్ రెగ్యులేటర్ పక్కనే ఉన్న మరో షేడ్ పై పడినట్టు గుర్తించారు. పేలుడు కారణంగా సిలిండర్ పిన్ సైతం సిలిండర్‌లోకి వెళ్లినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News