Wednesday, December 25, 2024

రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాం.. స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

ఇటీవల సెలబ్రెటీలకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి.  ఇప్పుడు ఈ జాబితాలో భోజ్‌పురి నటి అక్షరా సింగ్‌ కూడా చేరింది. తాజాగా ఆమెకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అక్షరా సింగ్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పాట్నా పోలీసులను ఆశ్రయించింది. తనకు వచ్చిన బెదిరింపు కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, 2010లో సత్యమేవ జయతే చిత్రంతో రవి కిషన్ సరసన తొలిసారిగా నటించింది. ఆ తర్వాత సౌగంధ్ గంగా మైయా కే, తబదాల, సర్కార్ రాజ్, లవ్ మ్యారేజ్, మా తుజే సలామ్ వంటి సూపర్ హిట్ చిత్రాలల్లో నటించి ప్రేక్షకులను అలరించిన అక్షరా.. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. భోజ్‌పురి క్వీన్‌గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం పొందుతున్న భోజ్‌పురి హీరోయిన్లలో ఆమె ఒకరిగా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.5 మిలియన్ల మంది ఫాలోవర్లను ఆమె కలిగి ఉన్నారు. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కోసం అక్షరా ప్రచారం కూడా చేసింది. దీంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News