Monday, December 23, 2024

భోజ్‌పురి నటి ఆకాంక్ష ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వారణాసి : ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే వారణాసిలో ఓ హోటల్ గదిలో ఆదివారం ఉదయం చనిపోయి ఉండగా గుర్తించారు.ఆమెది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ పాతికేళ్ల నటి సార్‌నాథ్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ హోటల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉన్నట్లు సిబ్బంది గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. భౌతికకాయాన్ని పోస్టు మార్టంకు తరలించారని స్థానిక పోలీసు కమిషనరేట్ ఓ ప్రకటనల తెలిపింది. నటి దూబే పలు ప్రాంతీయ భాషా చిత్రాలలో నటించారు. కసమ్ పైదా కర్నే వాలాకీ , ముఝే షాదీ కరోంగీ (భోజ్‌పురి), వీరేంకే వీర్ వంటి సినిమాలలో నటించారు.

శనివారం రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడుస్తూ కన్పించారు. తెల్లారేసరికి ఆమె సారనాథ్ ప్రాంతంలోని హోటల్ రూం నెంబరు 5లో విగతజీవిగా మారారు. ఆకాంక్ష ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లా పార్సిపూర్ గ్రామంలో జన్మించారు. ఉదయం ఆమె మేకప్‌మెన్ ఆమె కోసం హోటల్ రూంకు వెళ్లగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె సహనటుడు సమర్‌సింగ్‌తో కలిసి ఉన్న ఓ ఫోటోను పెట్టి, ప్రేమికుల రోజు సందేశం వెలువరించింది. దీనితో చెప్పకుండానే ఆమె ఈ యువనటి సమర్‌సింగ్‌తో ప్రేమలో పడ్డట్లు తెలియచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News