Friday, April 4, 2025

భోజ్‌పూరి గాయకురాలిపై కాల్పులు… తొడలోకి దూసుకెళ్లిన బుల్లెట్

- Advertisement -
- Advertisement -

పాట్నా: సాంస్కృతిక కార్యక్రమంలో భోజ్‌పూరి జానపద గాయకురాలు నిశా ఉపాధ్యాయ్ పాటపడుతుండగా ఆమెపై కాల్పులు జరిపిన సంఘటన బిహార్ రాష్ట్రం సరన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనతా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యగ్నోపవిత్ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రహ్మణ యువకులకు జంధ్యం ధరించడం కోసం ఉపనయనం అనే యాగం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జానపద గాయకురాలు నిశా ఉపాధ్యాయ్ పాటలు పాడుతు అలరిస్తోంది.

Also Read: మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?

కొందరు దుండగులు కాల్పులు జరపడంతో ఆమె తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమెను వెంటనే మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. నిశా డ్రమ్స్ వాయిస్తుండగా బుల్లెట్ గాయాలు తగిలినట్టు సోసల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు. నిశా స్వస్థలం సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ గ్రామం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News