Sunday, January 5, 2025

U-turn: మనసు మార్చుకున్న పవర్ స్టార్!

- Advertisement -
- Advertisement -

మనకు తెలుగులో ఒక పవర్ స్టార్ ఉన్నట్లే, భోజ్ పురి సినిమాల్లోనూ ఒక పవర్ స్టార్ ఉన్నాడు. ఆయన పేరు కూడా మన పవన్ కల్యాణ్ కు దగ్గరగానే ఉంటుంది! ఆయన పేరు పవన్ సింగ్. ఈయన నటుడే కాకుండా మంచి గాయకుడు కూడా.

ప్రతిజ్ఞ, సత్య, హర్ హర్ గంగే వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పవన్ కు యూత్ లో ఎంతో క్రేజ్ ఉంది. ఇది పసిగట్టిన బిజేపీ ఆయనకు అసన్ సోల్ లోక్ సభ టికెట్ ను కేటాయించింది. పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ నియోజకవర్గానికి ఎంతో పేరుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఈసారి కూడా తృణమూల్ తరఫున ఆయనే పోటీ చేస్తున్నారు. అయితే  ఎన్నికల గోదాలోకి దిగిన పవన్ కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పవన్ పాడిన కొన్ని పాటలు మహిళలను కించపరిచేవిగా, అనాగరికంగా ఉన్నాయంటూ తృణమూల్ నేతలు ధ్వజమెత్తడంతో చిన్నబుచ్చుకున్న పవన్, తాను ఎన్నికల బరిలోంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో బిజేపి శ్రేణులు కలవరపడ్డాయి. అయితే పార్టీ అగ్రనేతలు నడ్డా, అమిత్ షా నచ్చజెప్పడంతో పవన్ మనసు మార్చుకుని తాజాగా పోటీకి సై అన్నాడు. అదీ సంగతి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News