Wednesday, January 22, 2025

‘భోళా మానియా’ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ చిత్రీకర పూర్తి చేసుకుందీ మూవీ. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా ‘భోళా మానియా’ అనే తొలి సాంగ్ లిరికల్ వీడియోను ఈ నెల 4న సాయంత్రం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలసిందే.

ఇప్పటికే మేకర్స్ ఈ సాంగ్ ప్రోమోను వదిలారు. ఇందులో చిరు వేసిన స్టెప్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మహతీ స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంది. పూర్తి సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నారు. కాగా, ఈ మూవీలో చిరుకు జోడీగా తమన్నా నటిస్తుండగా, కీర్తీ సురేష్ చెల్లెలుగా నటిస్తోంది.కాగా, భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News