Thursday, January 9, 2025

మెగా ఫ్యాన్స్ కు మహాశివరాత్రి కానుక..

- Advertisement -
- Advertisement -

Bhola Shankar First Look Motion Poster Released

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మెగా అభిమానులకు ‘భోళాశంకర్’ చిత్రయూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జోడీగా నటిస్తున్న ‘భోళాశంకర్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో చిరంజీవి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీని మెహర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

Bhola Shankar First Look Motion Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News