Monday, December 23, 2024

భోలా శంకర్‌ నుంచి ‘భోలా మేనియా’…

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ’భోళా శంకర్’తో అభిమానులకు మెగా పండుగను అందించడానికి చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీని బ్లాక్ బస్టర్ నోట్‌తో ప్రారంభించారు. తాజాగా విడుదలైన మొదటి పాట భోళా మానియా మాస్‌ని ఆకట్టుకునే బీట్‌లతో హైలీ ఎనర్జిటిక్ నెంబర్. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను మహతి స్వర సాగర్ ఆకట్టుకునేలా స్వరపరిచారు.

రేవంత్ ఎల్వీ పాటని ఎనర్జిటిక్‌గా ఆలపించారు. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల పండుగలా వున్నాయి. సుస్మిత కొణిదెల స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఈ పాటలో చిరంజీవి స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించారు. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో భావోద్వేగాలు, ఇతర అంశాలు సమపాళ్లలో వుండబోతున్నాయి. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్‌గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News