Thursday, January 23, 2025

భోలక్‌పూర్ కార్పొరేటర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Bholakpur corporator arrested

14రోజుల రిమాండ్ నెటిజన్
ట్వీట్లతో రంగంలోకి కెటిఆర్
డిజిపి ఆదేశాలతో అదుపులోకి
కార్పొరేటర్

మన తెలంగాణ/ముషీరాబాద్ : భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌస్‌ఉద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు కోర్టులో హాజరుపర్చిన గౌసుద్దీన్‌ను న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో సోమవారం విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లపై కార్పొరేటర్ గౌస్‌ఉద్దీన్ దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడటం ఈ వివాదానికి కారణమైంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాంతో ఎంఎల్‌ఎ ముఠా గోపాల్ రంగంలోకి దిగి పోలీసులతో వివాదాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో ఎంఎల్‌ఎ గోపాల్ పోలీస్‌స్టేషన్‌లో సయోధ్య కోసం జరిపిన వీడియో సైతం బుధవారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కాగా, ఈ వీడియోను నెట్‌జన్లు మంత్రి కెటిఆర్, డిజిపికు ట్వీట్ చేయడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. కెటిఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో స్పందించిన డిజిపి ఆదేశాలతో చిక్కడపల్లి ఎసిపి శ్రీధర్ నేతృత్వంలోని ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్ కార్పొరేటర్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News