Sunday, January 5, 2025

హత్రాస్‌ ఘటనపై భోలే బాబా వీడియో సందేశం

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ ఘటనపై తొలిసారి సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబా స్పందించాడు. ఈ ఘటన అనంతరం పరారీలో ఉన్న బాబా ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో భోలే బాబా మాట్లాడుతూ.. సంఘటన తర్వాత తీవ్ర విచారానికి గురయ్యానని, దుర్మార్గులు తప్పించుకోలేరనే నమ్మకం ఉదని చెప్పారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని కమిటీ సభ్యులను కోరినట్లు తెలిపారు.

“జూలై 2 సంఘటన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఈ బాధను భరించే శక్తిని దేవుడు మాకు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, పరిపాలనపై నమ్మకం ఉంచండి. గందరగోళం సృష్టించిన వారెవరైనా వదిలిపెట్టరని నాకు నమ్మకం ఉంది. నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా ఉండి, జీవితాంతం వారికి సహాయం చేయాలని నేను కమిటీ సభ్యులను అభ్యర్థించాను” అని భోలే బాబా చెప్పారు.

కాగా, జూలై 2న హత్రాస్‌ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 121 మందికి ప్రాణాలు కోల్పోగా.. మందల మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న భోలే బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News