హైదరాబాద్: భూభారతి పోర్టల్‌ను సోమవారం జాతికి అంకితం చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూభారతి అమలుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ.. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలా భూభారతి ఉండాలని అన్నారు. భూభారతి కనీసం 100 ఏళ్ల పాటు గుర్తుండిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యాధునికంగా భూభారతి వెబ్‌సైట్ ఉండాలని.. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని తెలిపారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిసిఎల్‌ఎ ప్రధాన కమీషనర్ నవీన్ మిత్తల్, సిఎం ఓఎస్‌డి, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను ముందుగా 3 మండలాల్లో పైలట్‌గా అమలు చేస్తామని అన్నారు. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికలకు భూభారతి రిఫరెండం అవుతుందని పేర్కొన్నారు. మే మొదటివారంలో గ్రామపాలనాధికారుల నియామకం జరుగుతుందని తెలిపారు.