Thursday, October 24, 2024

అమోయ్ కుమార్ పై ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణ ల నేపథ్యంలో ఐఎఎస్ అధికారి అమోయ్ కు మార్‌ను ఇడి బుధవారం విచారించింది. బు ధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అమోయ్ కుమార్‌ని దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా ఇడి అధికారులు ప్రశ్నించారు. బుధవారం నాటి విచారణలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకల పై అమోయ్‌కుమార్‌ని ఇడి ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే అంశంలో తహసీల్దార్ జ్యోతి, ఆర్‌డివో, ఇతర సిబ్బంది చేసిన అ వకతవకలపైనా ఇడి ఆరా తీసినట్లు సమాచారం.

భూదా న్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్‌కుమార్‌ని ఇడి కోరినట్లు తెలిసింది. కాగా గత ప్రభుత్వ హయాంలో అమోయ్‌కుమార్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో భూదాన్ భూములతో పాటు పలు ప్రాంతాలలో భూకేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో తమ భూములు అన్యాక్రాంతంపై స్థానిక రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై సైతం ఇడి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం కూడా అమోయ్‌కుమార్‌ని ఇడి అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అసలేం జరిగింది?
గత ప్రభుత్వ హయాంలో హాట్‌స్పాట్‌గా భావించే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆయన కలెక్టర్‌గా ఉన్నారు. ఆ సమయంలో 50 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం అయినట్లు ఇడి అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల భాగోతం వెలుగు చూసింది. ఇదే వ్యవహారంలో అప్పటి ఎంఆర్‌వో జ్యోతిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. జ్యోతిపై కేసు నమోదైన తరువాత విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇడి దర్యాప్తు నిర్వహించింది. ఈ క్రమంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ ఉండడంతో ఆయనకు నోటీసు జారీ చేసిన ఇడి బుధవారం విచారణ నిర్వహించింది. కాగా, నాగరంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్‌కు చెందినదని బోర్డు వాదిస్తోంది. అయితే ఈ భూమి జబ్బార్దస్త ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది.

తరువాత కాలంలో జబ్బర్దస్తూ ఖాన్ కొడుకు హజీ ఖాన్ ఈ 50 ఎకరాలు ల్యాండ్‌ను భూదాన్ బోర్డ్‌కు దానం చేశారు. అయితే 2021లో హజీఖాన్ వారుసరాలినంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా అనే మహిల దరఖాస్తు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో , తహశీల్దార్, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకి అనుకూలంగా పని చేసినట్లు విచారణలో బహిర్గతమైంది. అనంతరం ఈ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మకాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఎన్నికల సమయంలో ఈ భూమికి సంబంధించి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ భూమి పై క్రయవిక్రయాలు జరగకుండా ధరణిలో నిషేధిత జాబితాలో అధికారులు పెట్టారు. ఈ వ్యహరం కోర్ట్‌కు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో అప్పటి ఎంఆర్‌ఒ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఇఐసిఎల్ కన్ట్రాక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్‌పై కేసు నమోదైంది. రెండు కేసుల్లో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఇడి రంగంలోకి దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News