Saturday, December 21, 2024

హారర్ కామెడీ ‘భూల్ భూలైయా 3’ ట్రైలర్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్, హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ, విద్యాబాలన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భూల్ భూలైయా 3. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బుధవారం జైపూర్‌లోని ఐకానిక్ థియేటర్ రాజ్ మందిర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి చిత్ర ప్రధాన తారాగణం అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా వదిలిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను భారీ పెంచేసింది. ఇందులో మాధురీ దీక్షిత్ కీలక పాత్ర పోషిస్తోంది.

అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు. అదే రోజున రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవ్ గన్ నటించిన సింగం ఎగైన్‌ కూడా విడుదల కానుంది. దీంతో ఈ రెండు సిినిమాల మధ్య వార్ జరగనుంది. మరి, ఏచిత్రం పై దీపావళి విన్నర్ నిలుస్తుందో చూడాలి.బాలన్‌తో పాటు మంజులిక భయంకరమైన పాత్రను పోషిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News