Thursday, January 23, 2025

8 లక్షల ఎస్‌డిఎఫ్ పనులకు భూమి పూజ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : జిల్లాలోని బోర్గాం (పి) విశ్వబ్రాహ్మణ సంఘం, శ్రీగోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం నాడు మంజూరైన ఎనిమిది లక్షల ఎస్డిఎఫ్ నిధులతో కమ్యూనిటీ భవన నిర్మాణం చేసేటప్పుడు భూమి పూజను చేయడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా ధర్‌పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్ తన చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… విశ్వ బ్రాహ్మణులు పుట్టుక నుండే ఆవిష్కరణలో మంచి నైపుణ్యంగా ఉన్న వారని వారు మంచి నిర్మాతలని కొనియాడారు.

ఈ సందర్భంగా జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. బోర్గాం పి విశ్వ బ్రహ్మణులు కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చెందాలని అందుకు ఐదో డివిజన్‌లో ఉన్న బిఆర్‌ఎస్ నాయకులం మీకు ఎల్లవేళలా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిసిసిబి డైరెక్టర్ నల్ల చంద్రశేఖర్ రెడ్డి, ఐదవ డివిజన్ కార్పొరేటర్ నందగిరి సౌజన్య, బిఆర్‌ఎస్‌జిల్లా మాజీ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, నుడా డైరెక్టర్ అభిలాష్, గ్రామ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి, ఈగ శ్రీనివాస్‌రెడ్డి, చామకూర హనుమాన్లు, మాజీ సర్పంచులు చామకూర ఎర్రన్న, చిట్టి సాయిరెడ్డి, మాజీ ఎంపిటిసి గుత్పె రఘు, విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహన చారి, గ్రామ అధ్యక్షులు కమ్మరి రాజేశ్వరి, ఉపాధ్యక్షులు ముచ్కూర్ గంగా నరసయ్య, కోశాధికారి వడ్ల జయడేవచారి, విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు 42 మంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News