Saturday, November 23, 2024

దళితులు, ఆదివాసీలకు ఆరెస్సెస్ చీఫ్‌ పదవి ఎందుకివ్వరు: ఛత్తీస్‌గఢ్‌ సిఎం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్‌:  బిజెపి మాతృసంస్థ ఆరెస్సెస్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆరెస్సెస్‌, బిజెపి కలిసి దేశంలో మతచిచ్చు రేపుతున్నాయని మండిపడ్డారు. ప్రజల మధ్య మతచిచ్చు రగిలించి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం బిజెపికి అలవాటుగా మారిందని విమర్శించారు. దాదాపు 40 వేల సంవత్సరాల క్రితం దేశంలో అందరి డిఎన్‌ఏ ఒకేలా ఉండేదని ఆరెస్సెస్‌ నేతలు చెబుతున్నారని, మరి అలాంటప్పుడు ఈ పగలు, ధ్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారని బఘేల్‌ ప్రశ్నించారు. ఆరెస్సెస్‌ ఛీఫ్‌ పదవిని ఎప్పుడూ ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వ్యక్తులకే ఎందుకు కట్టబెడుతారని, ఒక దళితుడినిగానీ, ఆదివాసీనిగానీ ఎందుకు ఆరెస్సెస్‌ చీఫ్‌గా నియమించరని బఘేల్‌ నిలదీశారు.

రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బిజెపి నేతల విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో బిజెపి ప్రస్తావిస్తున్న సమస్యలు కొత్తవేమీ కావని, ఇప్పటికే కాంగ్రెస్‌ వాటిని గుర్తించి పరిష్కరిస్తున్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News