Friday, December 20, 2024

భూత్పూర్‌లో.. భూ మాఫియా !

- Advertisement -
- Advertisement -

కోట్లు విలువ చేసే భూదాన్ భూములు హాంఫట్
చివరికి దేవాలయ భూములను చెరబట్టారు
వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు
కోట్లు గడించిన అక్రమార్కులు
మామూళ్లు మింగి రికార్డులను తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు
భూత్పూర్ బిఆర్‌ఎస్ నేతలే సూత్రధారులు
కొండలు, గుట్టలను వదలలే..

దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకు తిన్నట్లు.. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, కొందరు రాజకీయ నాయకులు ( గత పార్టీలోని ముఖ్యనేత ),రెవెన్యూ అధికారులు గజ దొంగల్లా కుమ్మక్కయ్యారు. మేక వన్నె పులులులాగా రాజకీయ రంగు కప్పుకొన్న రాబందులతో అధికారులు రాసుకుపూసుకు తిన్నారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను తిమింగలాల్ల ఆరగించేశారు. ప్రభుత్వ నిషేధిత భూములను అప్పనంగా మింగేశారు. ఎకరా కోట్లు విలువ చేసే భూధాన్ భూములను, అసైన్డ్ భూములను కబ్జాలు చేశారు. చివరికి దేవాలయ భూములను వదలలే. వాటిని చెరబట్టారు. ధరణిని తమకు అనుకూలంగా మార్చుకొని ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు చెందిన పేద వర్గాల భూములను కబ్జాలు చేశారు. అడిగితే దౌర్జన్యం చేశారు. అధికారం ఉంది కదాని విర్రవీగారు. భూము లు కోల్పోయిన వారు సంబంధిత రెవెన్యూ అధికారులను కాళ్ల వేళ్లాపడ్డా కనికరించలేదు. కాసులకు కక్కర్తి పడ్డ రెవెన్యూ అధికారులు కబ్జాదారులకే కొమ్ముకాశారు. వీరి వెనుక అప్పట్లో బడా రాజకీయ నేతల అండదండలు ఉండడంతో తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా వ్యవహరించి అందిన కాడికి అందినంత దోచుకున్నారు.

భూదాన్ భూములకు ఎసరు…
భూదాన్ భూములు ఆచార్య వినోభా బావే కృషి ఫలితంగా పేదలకు ఉచితంగా దక్కాయి. ఆయన చేసిన ఉద్యమం ఫలితంగా భూస్వాములు తమ భూమిలో కొంత భాగాన్ని స్వచ్చందంగా పేదలకు ఇవ్వడాన్ని భూధాన్ భూములుగా పిలుస్తారు.ఈ చట్టం 1951లో అమలులోకి వచ్చింది.ఈ చట్టం ప్రకారం పేదలకు పంపిణీ చేసిన భూధాన్ భూములను ఎవరూ కొనడానికి కాని, అమ్మడా నికి కాని హక్కు ఉండదు. ఆ భూములు కేవలం వ్యవసా యాధారిత కోసమే ఉపయోగపడాల్సి ఉంటుంది. ఒక వేళ వ్యవసాయానికి ఉపయోగంలో లేకపోతే ఆ భూములను ప్రభుత్వం స్వాదీనం చేసుకునే హక్కు ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ అదికారు లు కలిసి తుంగలో తొక్కారు. భూత్పూర్ మండల వ్యాప్తం గా ఉన్న వందల కొద్ది భూదాన్ భూములను, దేవాలయ భూములను ,ప్రభుత్వ అసైన్డ్ భూములను కబ్జా చేశారు. వాటిని వెంచర్లుగా మార్చి కోట్లాది రూపాయలు వెనుకేసు కున్నారు.

భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌లోని సర్వే నె ంబర్ 337లో 26 గుంటలు, సర్వే నెంబర్ 173,174,17 5,176,177 లో ( కస్తూరిభా పాఠశాల సమీపంలో ఉన్న భూమి ) దాదాపు 35 ఎకరాలను ( ఇది 44 నెంబర్ జాతీయ రహదారికి చేరువలో ఉంటుంది) పూర్వం ఎస్‌సి లకు 20,ఎస్‌టిలకు 10, ఒసిలకు 5 ఎకరాలు భూదానం జరిగింది. వీటిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక పెద్ద రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఏకంగా ఒక గోదాము నిర్మించి లీజుకు ఇచ్చుకున్నారు. అమిస్తా పూర్ శివారులోని సర్వే నెంబర్ 217,220లో 9 ఎకరాలు లావుని పట్టా బూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి.అదే విధంగా 362,368 సర్వే నెంబర్‌లో గల దేవాయ ల భూమిని కబ్జా చేశారు.208,211 గల సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్‌రూంల పక్కన భూమి ప్రభు త్వ భూమి అయినప్పటికీ దౌర్జన్యంగా వెంచర్లు వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాని పక్కన ఉన్న 4 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంచర్ వేయడమేకాకుండా కోట్లు విలు వ చేసే దేవుని కొండకు కూడా కన్నం వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. దాదాపు 16 ఎకరాలు ఉన్న ప్రబుత్వ కొండను తవ్వి తవ్వి 7 ఎకరాలకు తీసుకొచ్చారు. మిగిలిన దానిని కూడా ఆక్రమణకు సిద్దమవుతున్నారు. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని స్ధానికులు చెబుతున్నారు. ఇలా దాదాపు వంద కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వెంచర్లు వేసినట్లు సమాచారం.

సూత్రధారులు గత పార్టీ నేతలే …

భూత్పూర్ మున్సిపాల్టీలో కీలకంగా ఉన్న ఒక నేత, అమిస్తాపూర్ కు చెందన మరో నేత,మరో చోట నేత కలసి సిండికేట్‌గా మారారు. వీరంతా గత పార్టీ ముఖ్య నేతలు. కాని వీరు చెప్పేది శ్రీరంగ నీతులు అన్నట్లు, బయటికి మంచి మాటలు చెప్పి లోపల మాత్రం చేసేది చేసేస్తారు. వీరంతా కలిసి భూత్పూర్ మండలంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములపై గద్దల్లా వాలి ఆక్రమించుకుంటున్నారన్న ఆరో పణలు ఉన్నాయి. భూధాన్ భూములు, అసైన్డ్ భూములను కబ్జాలు చేసి కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి రెవెన్యూ అధికారి ( గతం) కీలకంగా మారి రికార్డులు తారు మారు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇరువురి మద్య పెద్ద ఎత్తున అవినీతి డీల్ జరిగినట్లు సమాచారం.

ఎంఆర్‌ఓ వివరణ…

మండల పరిధిలోని ప్రభుత్వ అసైన్డ్, భూదాన్ భూముల వ్యవహారంపై విచారణ చేస్తున్నాం. కొన్నింటిలో కాస్రా, ప ట్టా అని ఉంది. ధరణిలోకి వచ్చే సరికి కొన్ని నాలా అ నుమతి ఉంది. విచారణ చేస్తాం. ప్రభుత్వ ఆసైన్డ్, భూదాన్ భూముల అక్రమణ జరిగి ఉంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని భూత్పూర్ తహసీల్దార్ రాజు వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News