Monday, December 23, 2024

త్యాగాలు కాదు.. ఇది ప్రతీకారాల కాలం: ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

శివమొగ్గ: బిజెపి ఎంపి ప్రజ్ఞా ఠాకూర్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది త్యాగాలు చేసే సమయం కాదని, ప్రతీకారం తీర్చుకునే సమయమంటూ భోపాల్ ఎంపి ఆదివారం వ్యాఖ్యానించారు. కర్నాటకలోని శివమొగ్గలో ఆదివారం హిందూ జాగరణ వేదికకు చెందిన దక్షిణ ప్రాంతీయ వార్షక సదస్సులో ఆమె ప్రసంగిస్తూ హిందూత్వ కోసం ఇటీవలి కాలంలో కర్నాటకలో శఙమొగ్గకు చెందిన హర్షతోసహా అనేక మంది ప్రాణత్యాగం చేశారని, ఇక ఇప్పుడు ఆత్మబలిదానాల కాలం కాదని, ప్రతీకారం తీర్చుకునే సమయమంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లవ్ జిహాద్‌ను ప్రస్తావిస్తూ ఇందులో మొళకువలు ఏమిటో హిందూ తల్లిదండ్రులు కూడా తెలుసుకుని వాటిని తిప్పికొట్టాలని, లవ్ జిహాద్‌కు బలికావద్దని హిందూ బాలికలకు ఆమె పిలుపు ఇచ్చారు. హిందువులు తమ ఇళ్లలో కనీసం కూరగాయలు కోసే కతితోసహా ఆయుధాలు ఉంచుకోవాలని, స్వీయరక్షణ కోసం ఆయుధాలు ఉంచుకుంటే తప్పులేదని ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News