Monday, December 23, 2024

భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ స్పీడ్ పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భోపాల్‌న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్‌ను అనుకున్న స్పీడ్ పరిమితి కన్నా ఒక గంట పెరిగింది. గంటకు 160 కిమీ వేగంతో ఈ రైలును నడపాలని మొదట నిర్ణయించారు. కానీ దీన్ని ఆదివారం ప్రారంభించినప్పుడు గంటకు 161 కిమీ వేగం వరకు పరిమితి పెంచారు. ఇదే విధంగా ఆగ్రా లోని రాజా కి మండి నుంచి మధురకు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ కాలం కూడా ఒక గంట తగ్గించి స్పీడ్‌ను గంటకు 161 కిమీ చేశారు. అంతకు ముందు ఆగ్రా కంటోన్మెంట్ తుగ్లకాబాద్ సెక్షన్‌లో రాణీ కమలాపతి న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్ గరిష్ఠంగా గంటకు 160 కిమీ వరకు ఉంటుందని రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం భోపాల్ లోని రాణీ కమలాపతి రైల్వేస్టేషన్ నుంచి వందేభారత్‌రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News