Saturday, October 5, 2024

ధరణి బదులు భూభారతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:‘ధరణి’ వెబ్‌సైట్ స్థా నంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు రా ష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గతంలో 2020 లో ధరణి పోర్టల్‌ను అప్పటి ప్రభుత్వం అం దుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఆర్‌ఓఆర్ చట్టం అమ లు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏమీ లేకపోవడంతో చట్టం తెచ్చినా ప్రయోజనం లేకుం డా పోయినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ధరణి చట్టం తీసుకొచ్చినప్పటికీ మండల రెవెన్యూ, డివిజనల్ రెవెన్యూ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు పరిష్కరించాలో, ఏ స్థాయి అధికారికి ఏయే అధికారాలు ఉంటాయన్న మార్గదర్శకాలను సైతం అప్పటి ప్రభుత్వం పొం దుపరచలేదు. దీనికి తోడు రెవెన్యూ చట్టాలు పదు ల్లో ఉండడంతో భూ సమస్యలు పరిష్కరించేందుకు ఒక చట్టం కింద చర్యలు తీసుకున్నప్పుడు మరో చట్టం అడ్డు వస్తున్నట్లు ధరణి కమిటీ పరిశీలనలో గుర్తించారు. దీంతో భూచట్టాలను ఒకే గొ డుగు కిందకుతీసుకురావడం ద్వారా భవిష్యత్‌లో ఎలాం టి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

దీం తోపా టు పార్ట్-బి, సాదాబైనామాలకు చెందిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించి భూహక్కులు కల్పించాలంటే కొత్తగా ఆర్‌ఓఆర్ చట్టం తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. అందులో భా గంగా కొత్తగా ఆర్‌ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ధరణి కమిటీ సభ్యులు కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చట్టానికి సంబంధించిన అంశాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీ సుకెళ్లిన అనంతరం దానిని అసెంబ్లీలో ప్రవేశ పె ట్టేందుకు ధరణి కమిటీ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న ధరణి పో ర్టల్ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీ సుకుంది. ఈ నేపథ్యంలోనే చట్టం రూపకల్పనలో నిమగ్నమైన ధరణి కమిటీ సభ్యులు ఇప్పటికే కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందచేయనున్నట్టుగా సమాచారం.

అనంతరం దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న తప్పిదాల కా రణంగా పట్టాదారు రైతులు కూడా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. లక్షలాది మంది ధరణి బాధితులు సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది పట్టాదారు పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించిన తర్వాత భూ సమస్యలను పరిష్కరించేందుకు గత మార్చి మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో భూసమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొత్త తరహా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశగా చర్యలు
ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం, మరో వారం, పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది. మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండడంతో ధరణి కమిటీ లోతైన అధ్యయనం చేస్తోంది. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్‌ఓఆర్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పదుల సంఖ్యలో ఉన్న ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశలో చర్యలు తీసుకుంటోంది.

లక్ష మంది రైతుల భూములు ఆన్‌లైన్‌లో….
గత ప్రభుత్వంలోనే భూ సమస్యల పరిష్కారానికి దాదాపు 2.46 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి మొదటి వారంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వ చ్చిన దరఖాస్తులు మూడు లక్షలు దాటాయి. ధరణి కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇందులో లక్షకుపైగా సమస్యలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తి చేసుకుని సిసిఎల్‌ఏకు చేరినట్లు ధరణి కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ, ఆ లక్ష మంది రైతులకు చెందిన భూములు ఆన్‌లైన్ లో కనిపించవు. వారం, పది రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయ ని అధికారులు పేర్కొంటున్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్నవి, కు టుంబ తగాదాలతో పెండింగ్‌లో ఉన్నవి పక్కన పెడితే టిఎం-33 మోడ్యూల్ కింద పరిష్కరించాల్సిన భూ సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News