Monday, December 23, 2024

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కొత్త సొబగులు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: రాజధాని ఎక్స్‌ప్రెస్ రూపురేఖలు మారిపోయాయి. కొత్త సొబగులు సంతరించుకుంటోంది. దశాబ్దాల కాలంగా ప్రయాణికులకు సేవలను అందిస్తోన్న ఈ రైలులో మరిన్ని సౌకర్యాలను కల్పించడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దశలవారీగా అమలు చేయనుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్-న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా తేజాస్ లుక్‌ను ఇచ్చారు రైల్వే అధికారులు. తేజాస్ రైళ్ల బోగీలను దీనికి అమర్చారు. ప్రయాణికుల కోసం ఇందులో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను మరింత అప్‌గ్రేడ్ చేశారు. దశలవారీగా అన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు కూడా తేజాస్ కోచ్‌లను అమర్చే అవకాశం ఉంది. తేజాస్ కోచ్‌లను అమర్చిన భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జెండా ఊపి ప్రారంభించారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మంత్రులిద్దరూ హాజరయ్యారు. రైల్వే నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయబోతోన్నామని అన్నారు. సంబాల్‌పూర్ మార్గంలో రాకపోకలు సాగించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కూడా తేజాస్ బోగీలను అమర్చబోతోన్నామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ కొత్త రైలు రాకపోకలు ప్రారంభిస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News