Saturday, April 19, 2025

భూభారతి చట్టంతో రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పరోక్షంగా అభినందిస్తున్నారని అన్నారు. నారాయణ పేట ఖాజీపూర్ లో రెవెన్యూ సదస్సులో పొంగులేటి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2020 లో తెచ్చిన చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భూభారతి చట్టంతో రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. భూభారతి చట్టం దేశానికి ఆదర్శం కాబోతుందని, జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు కాబోతుందని పొంగులేటి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News