Monday, December 23, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు లో భుజంగరావు మధ్యంతర బెయిల్ రద్దు

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ2 నిందితుడు మాజీ అడిషినల్ ఎస్‌పి భుజంగరావు బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు గురువారం సాయంత్రం 4 గంటల లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావుని ఆదేశించింది. అనారోగ్య కారణాల రీత్యా ఈ ఏడాది 19వ తేదీన భుజంగరావుకు మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడిగిస్తూ వస్తోంది. అయితే గత నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా కోర్టు దానిని తిరస్కరించింది.

అదే సమయంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నించీ మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్టయ్యింది మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే అడిషినల్ ఎస్‌పిలు తిరుపతన్న, భుజంగరావులను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో సూత్రధారి ఎ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News