Monday, December 23, 2024

యువతకు ఆదర్శం భూక్య యశ్వంత్ నాయక్

- Advertisement -
- Advertisement -

మరిపెడ: పర్వతారోహుడు భూక్య యశ్వంత్ నాయక్ యువతకు ఆదర్శంగా నిలిచాడని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించి దేశ, రాష్ట్ర ఖ్యాతిని నలుమూలలా చాటాలని తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ అన్నారు. వివిధ పర్వతాలు దిగ్విజయంగా అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యతండాకు చెందిన పర్వతారోహుడు భూక్య యశ్వంత్ నాయక్‌ను మంగళవారం హైదరాబాద్‌లో తె లంగాణ డిజిపి అంజనీ కుమార్ అభినందించారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యతండాకు చెందిన భూక్య రాంమూర్తినాయక్, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు భూక్య యశ్వంత్ నాయక్ ఇప్పటికే ప్రపంచంలోని ఎత్తయిన ప్రసిద్ధిగాంచిన జమ్మూ కాశీర్ లేహ్ లడఖ్ ప్రాంతంలోని ఖర్డుంగ్‌లా, సౌత్ ఆఫ్రికా టాంజానియాలోని కిలిమంజారో, హిమాచల్ ప్రదేశ్ లాహోర్ సమీపంలోని యునామ్, రష్యాలోని ఎల్బ్రోస్ లాంటి ఎముకలు కొరికే మంచు కొం డలు, అగ్ని పర్వతాలను సైతం అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఇటివల ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వత శ్రేణి ఎవరెస్ట్‌కు ఎంపికై బేస్ క్యాంప్‌ను అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు.

ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ లక్ష సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం తథ్యమనడానికి యశ్వంత్ నిదర్శమన్నారు. యువత ఒక్కసారి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. యువత సన్మార్గంలో నడుస్తూ నిర్ధిష్ట లక్షాన్ని నిర్ధేశించుకుని లక్షం దిశగా కృషి చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. చిన్న వయస్సులో ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశం, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని నలుదిశలా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో రాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News