హైదరాబాద్ : టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌కు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. వీరిద్దరిని కర్నూలు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. నంద్యాల జిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఎవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సుబ్బా రెడ్డిని కారులో ఎక్కించి, అక్కడ్నించి ఆస్పత్రికి తరలించారు. ఎవి సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులపై హత్యయత్నం కేసులు నమోదుయ్యాయి. ఈ క్రమంలోనే అఖిలప్రియ పిఎ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
ఆనంతరం బుధవారం ఉదయం అఖిలప్రియ ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలించారు. మరోవైపు నంద్యాల్లో ఎవి సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అఖిలప్రియపై ఎవి సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ఫేస్‌బుక్ లైవ్ ద్వారా స్పందించిన జస్వంతి రెడ్డి అఖిలప్రియను దున్నపోతు, బజా రు మనిషి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాము పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నామని అందుకే ఈ ఘటన గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పారు. లోకే ష్ పాదయాత్ర డిస్టర్బ్ అవుతుందనే తాము మాట్లాడలేదని తెలిపారు. తండ్రి లాంటి వ్యక్తి మీద అఖిలప్రియ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: సుప్రీంకోర్టులో ఎంపి అవినాష్‌రెడ్డికి దక్కని ఊరట
అఖిలప్రియ హత్యాయత్నం చేశారని అంటోందని, ఆమె కొంచెం అన్న బుద్ది ఉండి మాట్లాడుతుందా? అని ప్రశ్నించారు. అఖిలప్రియ చేసే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉండవని అన్నారు. యువ గళం పాదయాత్ర లైవ్ వీడియోను గనక చూస్తే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు. అఖిలప్రియ ఆరోపిస్తున్నట్టుగా అక్కడ ఏం జరగలేదన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. అఖిలప్రియకు టికెట్ ఇస్తే మాత్రం ఒడించి తీరుతామని స్పష్టం చేశారు.