- Advertisement -
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సిపి నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్దారు. రెండున్నర కోట్లు పేదలకు పంచిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. భూమన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు మంచి చేశారు కాబట్టే జగన్ కు 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఊసే లేదని ఆరోపించారు. 95 శాతం హామీలు చంద్రబాబు గాలికొదిలేశారని, ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని తెలియజేశారు. పోసాని కృష్ణ మురళిపై అక్రమ కేసులు పెట్టారని, ఆరోగ్యంపై నాటకాలంటూ విష ప్రచారం చేస్తున్నపచ్చ పత్రికలు సిగ్గు పడాలని దుయ్యబట్టారు.
- Advertisement -