Monday, December 23, 2024

ఫ్రెండ్లీ ప్యాకెట్‌ ’13 ఎమ్‌ఎల్‌ ప్రెప్‌+ప్రైమ్‌ ఫిక్స్‌+’ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

కాస్మెటిక్స్‌ రంగంలో ప్రపంచ ప్రసిద్ధ మేకప్‌ బ్రాండ్‌ అంటే మన అందరికి గుర్తుకువచ్చేది M·A·C కాస్మెటిక్స్‌. M·A·C కాస్మెటిక్స్‌ ఇండియా రూపొందిస్తున్న అనేక ఉత్పత్తులు ఇప్పటికే మహిళల మనసు దోచుకున్నాయి. ఇప్పుడు మహిళల కోసం మరో అద్భుతమైన ఉత్పత్తిని లాంచ్‌ చేసింది M·A·C కాస్మెటిక్స్‌. అదే 13ఎమ్‌ఎల్‌ ప్రెప్‌+ప్రైమ్‌ ఫిక్స్‌+. కేవలం రూ.750 విలువైన ఈ అద్భుతమైన చిన్న ప్యాక్‌ మీ అందాన్ని ఇప్పుడు మరింత ఇనుమడింపచేస్తుంది. దీన్ని బ్రాండ్‌ అంబాసిడర్‌ భూమి పెడ్నేకర్‌తో కలిసి లాంచ్‌ చేసింది M·A·C కాస్మెటిక్స్‌.

ఇది చూడటానికి చిన్న ప్యాక్‌లా కన్పించినా… విషయం మాత్రం అంతకుమించి ఉంది. విటమిన్లు మరియు మినరల్స్‌తో పాటు కొంచెం నీరు, గ్రీన్ టీ, చమోమిలి రేకులు, దోసకాయల మిశ్రమంతో దీన్ని తయారు చేశారు. ఇది చర్మాన్ని రిఫ్రెషింగ్‌గా మారుస్తుంది. M.A.C కాస్మెటిక్స్ యొక్క ప్రెప్‌ + ప్రైమ్ ఫిక్స్+ తక్షణ తేమని తగ్గించి మీరు వేసుకున్న మేకప్‌ నాణ్యత పెరిగేలా మారుస్తుంది. ఇది వానిటీ ప్రధానమైనది, మేకప్ వేసుకునే ముందు చర్మాన్ని ప్రిపేర్ చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రకాలుగా కూడా దీన్ని ఉపయోగించవచ్చు, సహజమైన మంచు లాంటి మెరుపు కోసం సొంతంగా ఉపయోగించుకోవచ్చు లేదా మేకప్ పైన లైట్‌గా స్ప్రే చేసుకోవడం కూడా చేసుకోవచ్చు.

నిజం చెప్పాలంటే అసలు సిసలు అద్భుతమైన ప్రొడక్ట్‌ అంటే ప్రెప్‌ + ప్రైమ్ ఫిక్స్+. అయితే దీన్ని గత కొన్నేళ్లుగా వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త సువాసనలు, డిజైన్‌లు మరియు సైజులను మార్చుకుంటూ వస్తోంది M.A.C కాస్మెటిక్స్. ఈ జూలైలో ఈ కాస్మెటిక్స్‌ బ్రాండ్ తనకు ఎంతో ఇష్టమైన పాకెట్-ఫ్రెండ్లీ సైజ్‌లో లాంచ్ చేస్తోంది, ఇది చిన్న బ్యాగ్‌లో కూడా సరిపోతుంది. ప్రెప్‌ + ప్రైమ్ ఫిక్స్+ యొక్క 13 ఎమ్‌ఎల్‌ బాటిల్ ధర కేవలం రూ. 750 మాత్రమే. ఈ చిన్న బాటిల్‌ దేశంలోని అన్ని M.A.C కాస్మెటిక్స్ స్టోర్‌లలో. అలాగే అన్ని ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

అద్భుతమైన 13ఎమ్‌ఎల్‌ చిన్న బాటిల్‌ లాంచ్‌ సందర్భంగా బ్రాండ్‌ అంబాసిడర్‌ మరియు బాలీవుడ్‌ ప్రముఖ నటి భూమి పెడ్నేకర్‌ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ… M.A.C కాస్మెటిక్స్‌లో నాకు ఎంతో ఇష్టమైన ఫిక్స్‌ స్ప్రే ఇప్పుడు 13ఎమ్‌ఎల్‌ చిన్న బాటిల్‌లో దొరుకుతుందని తెలిసి ఎంతో ఆనందంగా ఉంది. నేను చాలా థ్రిల్ అయ్యాను కూడా. నేను జిమ్‌కి వెళ్లినప్పుడు దాన్ని నా క్లచ్‌లో, నా టోట్‌లో తీసుకెళ్లవచ్చు. అదీ కుదరకపోతే… నా జేబులో కూడా పెట్టుకోవచ్చు. ఫిక్స్+ నా చర్మాన్ని కేవలం ఒక స్ప్పేలో ఎలా హైడ్రేటెడ్ మరియు రిఫ్రెష్‌గా చేస్తుందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ కొత్త సైజు… నా ప్రయాణంలో సరికొత్తగా అవసరం అవుతుంది అని అన్నారు ఆమె.

ఈ సందర్భంగా M.A.C కాస్మెటిక్స్ ఇండియా బ్రాండ్ మేనేజర్ కరెన్ థాంప్సన్ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ… “మా బెస్ట్ సెల్లర్ అయినటువంటి ప్రెప్‌ + ప్రైమ్ ఫిక్స్+ని చిన్న ప్యాకెట్‌ రూపంలో పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది. కొత్త కస్టమర్‌లు పెద్ద బాటిల్‌ కొనుగోలు చేసే ముందు ఉత్పత్తిని పరీక్షించడానికి లేదా నమ్మకమైన కస్టమర్‌లు తమ క్లచ్‌లో తీసుకెళ్లడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కాలేజ్‌లో ఉన్నా, పని ప్రారంభించేముందైనా లేదా ఈ ఉత్పత్తిని ప్రయత్నించాలనుకున్నా కూడా ఈ చిన్న బాటిల్‌ మీ సందేహాలన్నీ తీర్చేస్తుంది. అందుకే దీని ధర, దీని సైజ్‌ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని మేము భావిస్తున్నాము అని అన్నారు.

“ నేను ఎన్నో ఏళ్లుగా మేకప్‌ ఆర్టిస్ట్‌గా ఉన్నాను. అందువల్ల నా వద్దకు చాలా ఉత్పత్తులు వస్తుంటాయి, నేను కూడా ప్రతీ రోజూ ఏదో ఒక కొత్తదాన్ని చూస్తూనే ఉంటాను. M.A.C యొక్క ఫిక్స్+ అనేది నా వ్యానిటీలో ఎక్కువగా ఉపయోగించే ఉత్పత్తులలో ఒకటి. అంతేకాకుండా ఎక్కువ గంటలు చర్మాన్ని అలాగే అసెట్ మేకప్‌ని ప్రిపేర్ చేయడానికి & హైడ్రేట్ చేయడానికి నేను దీన్నే ఉపయోగిస్తాను. నేను సెట్‌లో మేకప్‌ను రీటచ్ చేస్తున్నప్పుడు 13 ఎమ్‌ఎల్‌ వెర్షన్ నా చేతిలోకి తీసుకోడానికి, స్ప్రే చేయడానికి నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఖచ్చితమైనది. మేకప్ ఆర్టిస్ట్‌లందరికీ తప్పనిసరిగా ఉండాలి” అని అన్నారు గ్లోబల్ సీనియర్ ఆర్టిస్ట్ సోనిక్ సర్వాటే.

M.A.C కాస్మెటిక్స్ ప్రెప్‌ + ప్రైమ్ ఫిక్స్+ 13 ఎమ్‌ఎల్‌ చిన్న బాటిల్‌ జూలై 15 నుండి అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 750గా నిర్ణయించారు. ఈ చిన్న బాటిల్‌ maccosmetics.in, nykaa.com, myntra.com, ajio.com, shoppersstop.com, sephora.nnow.com, purplle.com, boddess.com అందుబాటులో ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని అన్ని MAC, Nykaa Luxe & షాపర్స్ స్టాప్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రెప్‌+ప్రైమ్‌ ఫిక్స్‌+ యొక్క కీలక ప్రయోజనాలు:

– చర్మాన్ని సున్నితంగా చేసి రిఫ్రెషింగ్‌గా మారుస్తుంది.
– తేమ ఆరిపోయేలా చేస్తుంది
– మేకప్‌ను మరింత మెరుగ్గా మార్చడమే కాకుండా దాదాపు 12 గంటలపాటు ఫ్రెష్‌గా ఉంచుతుంది
– చర్మ సంబంధపరంగా ఎలాంటి హాని లేదని టెస్ట్ చేయబడింది
– అలాగే కళ్లకు ఎలాంటి హాని కలిగించని టెస్ట్‌లు అన్నీ చేయబడింది
– అన్నింటికి మించి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేవు, మొటిమలు కూడా రాకుండా చేస్తుంది

ప్రెప్‌+ప్రైమ్‌ ఫిక్స్‌+ని ఉపయోగించే విధానం:

– మాయిశ్చరైజర్ రాసుకునే ముందు హైడ్రేట్ చేయడానికి తాజాగా కడిగిన చర్మంపై చిన్నగా స్ప్రే చేయండి

– మేకప్ పూర్తైన తర్వాత మరింత మెరుపు కోసం లైట్‌గా ఉపయోగించండి

– ప్రయాణంలో ఉన్నప్పుడు రిఫ్రెషింగ్‌ లుక్‌ కోసం ఉపయోగించండి

కేవలం ఒకే ఒక్క స్ప్రేతో హైడ్రేట్, ప్రైమ్, మేకప్‌ని సెట్ చేయడానికి, రిఫ్రెష్ చేసేందుకు ఈ చిన్న బాటిల్‌ను ఉపయోగించండి. అంతేకాదు మీ మేకప్ నాణ్యతను 12 గంటల వరకు మెరుగుపరచడానికి సిద్ధంగా ఉండండి.

Bhumi Pednekar launches Prep+Prime Fix+

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News