Wednesday, January 22, 2025

రేపు మేడారం కు మంత్రులు హరీష్, కొప్పుల రాక

- Advertisement -
- Advertisement -

ధర్మారం: మండలంలోని నంది మేడారంకు నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రానున్నారు. మేడారం ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించి ఆరు పడకల నుంచి 30 పడకల ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం రూ.5.74 కోట్లు మంజూరు చేసింది. స్వర్గీయ పొనుగోటి మురళీధర్‌ రావు స్థలాన్ని నాడు దానం చేయగా ఆ స్థలంలో నిర్మించిన ఆసుపత్రి స్థానంలోనే 30 పడకల ఆసుపత్రిని నిర్మాణానికి వారు భూమి పూజ చేయనున్నారు. గత నవంబర్ 24న ఆసుపత్రికి భూమి పూజ చేయాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రద్దయ్యింది.

గురువారం మంత్రుల చేతుల మీదుగా భూమి పూజ చేయనుండగా భారీ ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అన్ని గ్రామాల నుండి ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News