Monday, December 23, 2024

సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ

- Advertisement -
- Advertisement -

అమరచింత ః అమరచింత మండల పరిధిలోని సింగంపేట గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగంపేట సర్పంచ్ జెడ్పిటిసి మార్కు సరోజ, అమరచింత మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు ముదిరాజ్, రమేష్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News