- Advertisement -
ఇటిక్యాల : మండల కేంద్రంలోని బీచుపల్లి,యక్తపురం,కొండపేట,ఎర్రవల్లి,కోదండపురం తదితర గ్రామాలలో ఆదివారం రూ.45లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే విఎం అబ్రహం ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ నేతలతో కలసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు పట్టణాలను తలపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయన్నారు.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యంతో పాటు పారిశుధ్యానికి ప్రధాన్యత ఇచ్చిందన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సిసి రోడ్డు పనులలో నాణ్యతను పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు,ఎంపిటీసిలు ,బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
- Advertisement -