Wednesday, December 25, 2024

సంక్రాంతికి భూమిపూజ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశం లో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో గృహనిర్మాణాలకు సంబంధించి మంగళవారం ఆయ న హియాయత్‌నగర్‌లోని హౌసింగ్ కా ర్పొరేషన్ కార్యాలయంలో అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి క లిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను (పిడిలను) ని యమించుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల చొప్పున వ చ్చే నాలుగేళ్లలో 20 లక్షలకు తక్కువ కాకుండా అత్యంత నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈనెల23తేదీ నా టికి సుమారు 32 లక్షల దరఖాస్తులను పరిశీలించామని, రోజు కు నాలుగున్నర నుంచి ఐదున్నర లక్ష ల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, జ నవరి మొ దటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప రిశీలన పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతం చేస్తున్నామనిచ గత ప్రభుత్వం ఈ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 95శాతం కార్పొరేషన్ ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది నాలుగన్నర లక్షల ఇండ్ల నిర్మాణమే కాకుండా 20 లక్షల ఇళ్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా ఆయన చెప్పారు. చిన్నచిన్న తప్పులు కూడా జరగకుండా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. మొదటి విడతలో వికలాంగులు, వితంతువులు వంటి వారికి అవకాశం ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిబంధనల మేరకు కొంతమందిని తిరస్కరించినా రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. కేంద్రం విధించే నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర నిధులను తీసుకుంటామన్నారు. ఈ విషయంలో తాము ఎటువంటి బేషజాలకు పోయేది లేదన్నారు.

హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం చేపడుతాం
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో తగ్గేది లేదని మంత్రి తెలిపారు. తల తాకట్టుపెట్టయినా ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి పేషి మొదలు కొని తన పేషీ, ముఖ్యఅధికారుల కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక విధి, విధానాలు ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు. వారంరోజుల్లోగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యేక వెబ్‌సైట్‌ట్, టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ మారుమూల తండా, లేదా గ్రామం నుంచైనా ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు దారునికి తిరిగి వివరాలు అందిస్తామన్నారు.

ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ అధికారుల నియామకానికి నిర్ణయించామని, త్వరలోనే 1,200 మంది సర్వేయర్లను నియమిస్తామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో రేషన్‌కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి తొలుత ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపికచేస్తాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏ అధికారి తప్పుచేసినా కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను కూడా నిర్మిస్తామని, హైదరాబాద్ నలువైపులా వందేసి ఎకరాలను సమీకరించి హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి బుద్ధ ప్రకాష్, ఎండి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

స్వగృహలో జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తాం
స్వగృహ టవర్స్‌కు సంబంధించి పోచారంతో పాటు కొన్ని చోట్ల మిగిలిపోయిన ఇళ్లకు సంబంధించి జర్నలిస్టులకు అవకాశం ఇస్తామని మంత్రి పొంగులేటి హామీనిచ్చారు. తమకు కూడా ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం ఇస్తారా అని ఆయన్ను అడగ్గా ప్రస్తుతం పేదల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని మంత్రి తెలిపారు. జర్నలిస్టుల కూడా స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించినా చివరినిమిషంలో కొన్ని కారణాలు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హౌసింగ్ ఆధ్వర్యంలో ఉన్న స్వగృహ ఇళ్లలో జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని, రెండురోజుల్లో హౌసింగ్ ఎండి, మీడియా అకాడమీ చైర్మన్‌లు ఒకసారి ఆ ఇళ్లను పరిశీలిస్తే దానికి సంబంధించిన విధి, విధానాలను ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News