Monday, December 23, 2024

స్కిల్ యూనివర్శిటీకి భూమి పూజ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కందుకూరు: రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి ఎంఇఐఎల్ సంస్థ (మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) ప్రతినిధులు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా, కం దుకూరు మండలం, మీర్‌ఖాన్‌పేట్ పరిధిలోని 57ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించే భ వనానికి ఎంఇఐఎల్ డైరెక్టర్ రవి పి రెడ్డి, వై స్ ప్రెసిడెంట్ శివకుమార్ స్థానిక అధికారులతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, ఎంఇఐఎల్ డిపిఎ కృష్ణారెడ్డి, వర్సిటీ వైస్స్ ఛాన్సలర్ సుబ్బారావు మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగిందని అన్నారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర

అవతరణ దినోత్సవం నాటికి తొలిదశ భవనాల నిర్మాణం పూర్తిచేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ భవనం అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణహితంగా నిర్మాణానికి రూపకల్పన చేశామన్నారు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సిఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో భూమి పూజ చేశారని తెలిపారు. యూనివర్సిటీ భవనాల డిజైన్లు ఖరారు కావడంతో పనులు చకాచకా నిర్వహించేందుకు ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ యూనివర్సిటీ నిర్మాణం వలన విద్యార్థులకు అధునాతన బోధన సౌకర్యాలతోపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించడానికి క్యాంపస్, అకడమిక్ భవనాలు, వర్క్‌షాప్‌ల నిర్మాణం జరుగనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఐఎల్ సంస్థ సభ్యులు, స్కిల్ యూనివర్సిటీ అధికారులు, స్థానిక జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News