Monday, December 23, 2024

బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

- Advertisement -
- Advertisement -

బాల్కొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన స్వంత ఖర్చుతో రూ. లక్షా ఇరవై వేల రూపాయల విలువ గల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్(బి) ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటుకు భూమి పూజ చేయడం జరిగిందని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపిపి లావణ్యలింగాగౌడ్, సర్పంచ్ భూస సునీత నరహరి, విడిసి సభ్యులు పిప్పెరా ఆశోక్, అర్కరి గంగాధర్, గ్రామస్తులతో కలిసి శుక్రవారం భూమి పూజ చేసి వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజాన్ని ఎదిరించిన వీరుడని వారు గుర్తు చేశారు. తెలుగు సంవత్సరం 1674లో హిందూ నెల జ్యేష్ట శుద్ద త్రయోదశి ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారని వారు తెలిపారు.

పెద్ద మనస్సుతో విగ్రహం ఏర్పాటుకు రూ. 1.20 వితరణగా ఇచ్చినందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డికి, బాల్కొండ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తౌటు గంగాధర్, బిఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, యువజన విభాగం మండల అధ్యక్షులు గాండ్ల రాజేష్, వైస్ ఎంపిపి శ్రీకాంత్ యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ వూంపల్లి పెద్ద బాల్ రాజేశ్వర్, సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్, వార్డు సభ్యులు తోపారం ఆశోక్, నాయకులు తోపారం గంగారాం, కాల గంగారాం, మాజీ విడిసి అధ్యక్షుడు ఆరేపల్లి పోతరాజు, కమిటి సభ్యులు చింతలూరి గంగాధర్, సంజీవ్ గౌడ్, జంగం సతీష్, తెడ్డు చక్రి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News