Monday, December 23, 2024

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

- Advertisement -
- Advertisement -

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. బుధవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కేకే, సిఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు.

ఇక, సచివాలయం ముందు మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. త్వరలోనే ఈ కారక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. మరి విగ్రహం పెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News