Monday, January 27, 2025

ఇంగ్లాండ్ అలా ఆడితే నాకే వికెట్లు: బుమ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ బజ్‌బాల్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేస్తే తనకు వికెట్లు పడగొడుతానని బుమ్రా తెలిపాడు. ఇంగ్లాండ్ ఈ మధ్యలో బజ్‌బాల్ పేరుతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోందని, అలా కూడా టెస్టు క్రికెట్ ఆడొచ్చని రుచి చూపించిందన్నారు. బజ్‌బాల్ అనే పదాన్ని తాను పట్టించుకోనని, వాళ్లు వేగంగా ఆడుతూ తనని అలసిపోయేలా చేయలేరన్నారు. వాళ్లు వేగంగా ఆడితే తనకు చాలా వికెట్లు దక్కుతాయని బుమ్రా వివరణ ఇచ్చాడు. మైదానంలో ఉన్నప్పుడు పరిస్థితులను తనకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో తెలుసునని బుమ్రా చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News