Thursday, January 23, 2025

కెసిఆర్‌కు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణంలో వైఫల్యాలపై విచారణ నిమిత్తం సె ప్టెంబర్ 5న విచారణ కోసం హాజరు కావాలంటూ భూపాలపల్లి కోర్టు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరికొందరికీ నోటీసులిచ్చింది. రూ.లక్ష కోట్ల వ్య యం చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నాటి కెసిఆర్ సర్కారే కారణమని, దీనివల్ల భారీగా ప్రజా ధ నం దుర్వినియోగం అయిందని, కాళేశ్వరం ప్రా జెక్టు లక్ష్యమే దెబ్బతిందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలంటూ పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. బ్యారేజీ దెబ్బతి న్న అంశంపై సమగ్ర విచారణ చేయాలంటూ పో లీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు నాటి మం త్రి హరీశ్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సిఎంఒ కార్యదర్శి స్మితా సబర్వాల్, అప్పటి చీఫ్ ఇంజనీర్లు, మేఘా సంస్థ నిర్మాణదారులు భాగమేనని, వీరందరిపై విచారణ చేపట్టి శిక్షించాలని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, నిర్మాణానికి ముందు కనీసం సాయి ల్ టెస్ట్ కూడా చేయలేదని పిటిషనర్ ఆరోపించారు. పదే పదే డిజైన్లు మార్చారని, నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని పేర్కొన్నారు. వర్షాలు, వరదల ముందు, ఆ తర్వాత చేయాల్సిన పరీక్షలను, తనిఖీలను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు. మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన పలు టెక్నికల్ అంశాలను డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరినా ఇవ్వకుండా లోపాలను దాచే ప్రయత్నం చేశారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన భూపాలపల్లి కోర్టు, ఈ అంశంలో విచారణ నిమిత్తం సెప్టెంబర్ 5వ తేదీన హాజరు కావాలంటూ కెసిఆర్, హరీశ్ రావులతో పాటు మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. అయితే, తొలుత ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశానని, తన పిటిషన్‌ను కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో ఇప్పుడు దాఖలు చేయాల్సి వచ్చిందని రాజలింగమూర్తి పేర్కొన్నారు.

బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్ళు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని, పోలీసులు కూడా ఐపిసిలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్‌ఐఆర్ (నెం. 174/2023) నమోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని పిటిషనర్ గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబర్ 25న మేడిగడ్డ కుంగుబాటుపై పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశానని, తర్వాత జిల్లా ఎస్‌పికి, డిజిపికి కూడా కంప్లైంట్ చేశానని రాజలింగమూర్తి పిటిషన్‌లో వెల్లడించారు. అయినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టుకెక్కినట్లు వెల్లడించారు. కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ అంతర్ రాష్ట్ర వంతెన కుంగిన విషయం విదితమే. బ్యారేజీ బి -బ్లాక్‌లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున ఒక ఫీటు వరకు కిందికి కుంగింది. రాత్రివేళ వంతెన కుంగిపోయిన విషయాన్ని మహరాష్ట్ర వెళ్లే ప్రయాణికులు గుర్తించి బయటకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదంతా బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే జరిగిందంటూ విపక్షాలు అప్పట్లో మండిపడిన విషయం విదితమే. ఆ తర్వాత ప్రభుత్వం మారడం.. బ్యారేజీని పరిశీలిం చడం అన్ని జరిగాయి. ఇటీవలే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కూడా ప్రాజెక్టును సందర్శించారు. అయితే, ఇప్పటికే కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భూపాలపల్లి సెషన్స్ కోర్టు విచారణ చేపడుతుండడంతో మేడిగడ్డ డ్యామేజ్ కేసు ఆసక్తిగా మారింది. మరోవైపు సెప్టెంబరు 5న విచారణ జరగనున్నందున ఈ ఎనిమిది మంది హాజరవుతారా? లేక వారి తరఫున న్యాయవాదుల్ని పంపుతారా?అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News