Monday, December 23, 2024

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రత్ మధ్యాహ్నం 2.00 గంటలకు కొత్త సెక్రటరియేట్ కాంప్లెక్స్ లోని హెలిపాడ్ గ్రౌండ్‌లో ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 182 సీట్లకు 156 సీట్లు గెలుచుకుని రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించిందన్నది తెలిసిందే. 1960లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద స్థాయిలో సీట్లను గెలువడం ఇదేనని చెప్పాలి. గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డం అన్నది ఇది ఏడవసారి.  ఆయన గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు.

గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ 2021 సెప్టెంబర్ 13న బాధ్యతలు చేపట్టారు. ఆయన 2021 సెప్టెంబర్ 12న బిజెపి శాసన సభాపక్షం నాయకుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. భూపేంద్రతో పాటు ఇతర ఎంఎల్‌ఏలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య హర్ష్ సంఘవీ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జగదీశ్ విశ్వకర్మ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News