రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ బుధవారం విజ్ఞప్తి చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ సినిమాకు పన్ను మినహాయించాలని విపక్ష బిజెపి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేంద్రాన్ని దీనిపై అభ్యర్థించారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత శాసనసభలో విపక్షనాయకుడు బిజెపి నేత ధరమ్‌లాల్ కౌశిక్ కశ్మీర్ ఫైల్స్ సినిమాకు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. కౌశిక్ డిమాండ్‌కు సిఎం స్పందించి జిఎస్‌టి (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అమలు లోకి వచ్చిన తరువాత ఇందులో సగానికి సగం కేంద్రానికి వెళ్తోందని, అందువల్ల దేశం మొత్తం మీద ఈ సినిమాకు పన్ను మినహాయింపు కేంద్రం కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. అందరు ఎంఎల్‌ఎలు, ఇతర ఉన్నతాధికారులు కశ్మీర్‌ఫైల్స్ సినిమాను సందర్శించాలని సిఎం కోరారని ప్రజాసంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.