Thursday, January 23, 2025

ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘భువన విజయమ్’ టీమ్

- Advertisement -
- Advertisement -

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో ధనరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్ర. ప్రేక్షకుడి పాత్ర పోషించాను. సినిమాలోని పాత్రలని నేను ఎలా చూస్తానో ఆడియన్స్ కూడా అలానే చూస్తారని డైరెక్టర్ చెప్పారు. చాలా సవాల్ గా అనిపించింది. చాలా మంది నటీ నటులుతో ఈ సినిమా చేయడం అనందంగా వుంది. కంటెంట్ వున్న సినిమా భువన విజయమ్’. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. మే 12న అందరూ థియేటర్ లో వచ్చి చూడాలి” అని కోరారు.

థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. ఇంత మంది నటీనటుల డేట్లు కావాలంటే చాలా కష్టం. కానీ నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాని తీశారు. ఇందులో రైటర్ గా డిఫరెంట్ రోల్ చేశాను. దర్శకుడు అద్భుతంగా చేశాడు. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. ఇది ఒక కుటుంబ నేపధ్యంలో జరిగిన కథలా సరదాగా జరిగింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

దర్శకుడు యలమంద చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రయాణంలో నాతో నడిచిన అందరికి కృతజ్ఞతలు. రాయల వారు ‘భువన విజయ చక్రవర్తి. మా చిత్రానికి మాత్రం మా నిర్మాతే అసలైన చక్రవర్తి. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నా మొదటి సినిమాకే గొప్ప నటీనటులతో కలసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ విషయంలో మా నిర్మాతకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్ వేశాం. ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు. అ గుర్తింపు గెలుపుతోనే వస్తుంది. ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే భువన విజయం ఓడి గెలిచినవాడి కథ. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని గెలిపించిన కథ. అదే ఈ భువన విజయం కథ. ఇందులో కామెడీ, ఫాంటసీ, థ్రిల్ అన్నీ వున్నాయి. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక నిపుణల సహకారంతో సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరిగింది. మే 12న సినిమా విడుదలౌతుంది. మీ అందరి సహకారం కావాలి’ అని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News